తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలంటే అందరూ ప్రధానంగా చర్చించుకునేది కులాల గురించే. ఏ కులం ఓట్లు ఏ పార్టీకి పడే ఛాన్స్ ఉంది? ఈసారి ఏ కులం వారు ఏ పార్టీ పక్షాన నిలపడుతున్నారు? ఓబీసీ(OBC)లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఎలాంటి ప్లాన్ వేశాయి? ఎస్సీ, ఎస్టీ ఓట్లను తమవైపునకు పార్టీలు ఎలా తిప్పుకుంటున్నాయి? అగ్రకులాల మద్దతు కోసం పార్టీలు ఎలాంటి స్ట్రాటజీలు వేస్తున్నాయి లాంటి ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. విశ్లేషకులే కాదు.. సామాన్య ప్రజలూ ఎన్నికలప్పుడు కులాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అటు రాజకీయ నాయకులూ ఇదే అస్త్రంతో ఎన్నికల ప్రచారంలోకి దూకుతుంటారు. తాజాగా కాంగ్రెస్ అదే చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పర్యటిస్తున్న హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులగణన అస్త్రాన్ని బయటకు తీశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..EXPLAINER: తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా ఓబీసీ కులగణన? రాహుల్ అస్త్రాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొనున్నారు?
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కులాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం గురించి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకు ఉంటున్నారంటూ రాహుల్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టాల స్ట్రాటజీతో కాంగ్రెస్ కులగణన అంశాన్ని హైలెట్ చేస్తుందా? ఇది రానున్న ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా తెలుసుకోవాలంటే పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Translate this News:












