Former Chief ISRO : ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. ఇప్పటివరకు అడ్డంకులు లేకుండా అన్ని దశలను పూర్తి చేసింది. చంద్రయాన్ 3 ఇప్పుడు చివరి ఘట్టంలోకి అడుగుపెట్టింది. చంద్రుడికి మరింత చేరువయ్యే క్రమంలో ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) విడిపోయింది. చంద్రయాన్-3 జూలై 14న ప్రయోగించగా, ల్యాండర్ ఆగస్ట్ 23న చంద్రుడిని తాకుతుందని అంచనా వేశారు. రష్యా తన చంద్ర మిషన్‌ను ఆగస్టు 10న ప్రారంభించింది. ఆగస్టు 21న ల్యాండింగ్‌ను ప్లాన్ చేసింది. మిషన్లు తీసుకున్న సమయంలో భారీ వ్యత్యాసం ఏమిటంటే, భారత్ చంద్రునిపై స్లింగ్‌షాట్‌ను ఎంచుకుంది, ఇది భూమి గురుత్వాకర్షణను ఉపయోగించి అంతరిక్ష నౌకను దాని పథంలో నడిపిస్తుంది. అయితే రష్యా ఉపగ్రహాన్ని నేరుగా చంద్ర కక్ష్యలో ఉంచడానికి భారీ రాకెట్‌ను ఉపయోగించింది.
పూర్తిగా చదవండి..Former Chief ISRO: ఓ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు..!!
అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూసుకుపోతోంది. తక్కువ ఖర్చుతో ప్రయోగం చేస్తూ ప్రపంచ దేశాలను సైతం ఆకర్షిస్తోంది. ఓ హాలివుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారక మిషన్ ను విజయవంతంగా చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించింది భారత్. అంతరిక్ష పరిశోధనల్లో పొదుపు మంత్రంతో ముందుకు దూసుకెళ్తోంది. చంద్రయాన్ -3 విషయంలో కూడా ఆదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే ఈ ప్రయోగాలపై ఇస్రో మాజీ ఛైర్మన్ కే శివన్ స్పందించారు. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు భారీ రాకెట్లు అవసరమవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Translate this News:











