కాంగ్రెస్ పార్టీలో టికెట్ల చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా ఆ పార్టీలో టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరిగిందని బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేతల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు సైతం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సోనియాగాంధీకి సంచలన లేఖ రాశారు. ముఖ్యంగా ఇటీవల కేటాయించినటువంటి 54 టిక్కెట్లలో దాదాపు 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు అంటూ ఆ లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ఆయన ప్రధానంగా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నాడని తన అనుచరులతో కలిసి ఫేక్ సర్వేలను నిర్వహించి బీసీలకు టికెట్లు తగ్గకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..రేవంత్ తీరుతో కాంగ్రెస్కు నష్టం..సోనియా, రాహుల్కు గోనె ప్రకాష్ సంచలన లేఖలు..!!
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నాడని...ఫేక్ సర్వేలను నిర్వహించి బీసీలకు టికెట్లు తగ్గేలా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు, వెనకబడిన వర్గాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.

Translate this News:











