సీఎం కేసీఆర్ (CM KCR) కామారెడ్డిలో పోటీ చేస్తున్నానంటూ ప్రకటించిన నాటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆ సీటు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ కు పోటీగా ఇతర పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగుతారు? అన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ లో కామారెడ్డి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali) ఈ సారి బరిలో ఉండరన్న చర్చ సాగింది. ఈ నేపథ్యంలో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు షబ్బీర్ అలీ.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: కోమటిరెడ్డి మీద బూర నర్సయ్య పోటీ?
Kamareddy: కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీ.. షబ్బీర్ అలీ సంచలన ప్రకటన
ఈ సారి కూడా తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తున్నట్లు మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. తాను నియోజకవర్గం మారున్నట్లు జరిగిన ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పనేనంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కామారెడ్డికి ఓ పొలిటికల్ టూరిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.

Translate this News:











