క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్.. ఇప్పుడు ఓటింగ్ వ్యవస్థపై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగించింది భారత ఎన్నికల సంఘం. పట్టణ ప్రాంతాలు, యువతలో ఓటింగ్ శాతం పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాయలంలో సచిన్, సీఈసీ మధ్య ఒప్పందం(MOU) కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయనున్నారు సచిన్. ఓటింగ్‌పై అవగాహన పెంచే క్రమంలో ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచార కర్తగా నియమితులైన సచిన్.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటర్లు బాధ్యతతో తప్పనిసరిగా ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం పట్టణ, నగరాల్లో ఓటింగ్ పట్ల అనాసక్తి చూపే వారిలో ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని ఈసీ పేర్కొంది.
పూర్తిగా చదవండి..సచిన్ సెకండ్ ఇన్నింగ్స్.. ఎన్నికల సంఘం ప్రచారకర్తగా ఒప్పందం
క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన ఆటతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్.. ఇప్పుడు ఓటింగ్ వ్యవస్థపై యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగించింది భారత ఎన్నికల సంఘం.

Translate this News:












