ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. మాంసాహారాన్ని కొనేందుకు మక్కువ చూపుతుంటారు. ఎక్కువగా చికెన్, మటన్ తింటుంటారు. కానీ రెడ్ మీట్ కంటే సీఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అసలు సీ ఫుడ్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది చేపలే. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చెరువుల్లో చేపలను తింటూ ఉంటాం. కొందరు సముద్రపు చేపలను అప్పటికప్పుడు పట్టుకొచ్చి కూర వండుకుని తింటుంటారు. చెరువుల్లో ఉండే చేపల కంటే సముద్రపు చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు అంటున్నారు. సాధారణంగా చేపలను వారానికి మూడుసార్లు తింటే చాలా లాభాలున్నాయని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..health benefits: చేపలు తింటే మతిమరుపు మాయం..ఇంకా ఎన్నో లాభాలు..!
చేపలు చేసే మేలు గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. రెడ్ మీట్(చికెన్, మటన్) కంటే సీ ఫుడ్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చేపలను ఎక్కువగా తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందని.. అలాగే మన జ్ఞాపకశక్తి కూడా మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మధుమేహం, బీపీకి సంబంధించిన సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది.

Translate this News:











