భారత్‌లో క్రికెట్ మతమైతే.. ఆ మతానికి సచిన్ దేవుడు. క్రికెట్‌గాడ్‌గా కేవలం భారతీయులతోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar). అతను క్రికెట్‌ని వీడి ఇప్పటికీ పదేళ్లు గడుస్తున్నా అభిమానుల మనసుల్లో మాత్రం ఇప్పటికీ సచిన్ సచిన్‌లాగే ఉన్నాడు. అతను కనిపిస్తే ఇప్పటికీ ‘సచిన్..సచిన్’ అంటూ నినాదాలు చేస్తారు ఫ్యాన్స్. 24ఏళ్ల పాటు టీమిండియాకు ఆడిన సచిన్ ఆటను ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆటనే శ్వాసగా.. బ్యాట్‌నే ఆయుధంగా బతికిన సచిన్ తనకు అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్‌పై ప్రేమను చాటుకుంటాడు. తాజాగా మరోసారి అదే చేశాడు. దసరా సందర్భంగా సచిన్ చేసిన ‘ఆయుధ పూజ’ నెట్టింటిని ఊపేస్తోంది.
పూర్తిగా చదవండి..Sachin Tendulkar: బ్యాటే ఆయుధం.. ఆటే ప్రాణం.. దసరా వేళ సచిన్ మార్క్ ‘ఆయుధ పూజ’ ఇది!
క్రికెట్‌ను ప్రాణంగా భావించే సచిన్.. ఆట పట్ల తనకున్న ప్రేమను మరోసారి చూపించాడు. దసర సందర్భంగా ఆయుధ పూజ వేళ.. 'బ్యాట్-బాల్' ని దేవత ముందు పెట్టి పూజ చేశాడు సచిన్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. 'బంతి బౌండరీ దాటినట్లే, చెడుపై మంచి సాధించిన విజయం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.. సరైన మార్గం కోసం బ్యాటింగ్ చేస్తూ ఉండండి' అని అభిమానులకు మెసేజ్ ఇచ్చాడు క్రికెట్ గాడ్.

Translate this News:











