తనకల్లు మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామ సమీపంలోని చాకివేలు క్రాస్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం బాటిల్స్ తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 92 కర్ణాటక మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కదిరి డీఎస్పీ శ్రీలత (Kadiri DSP Srilatha) తెలిపారు. శుక్రవారం పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Karnataka Liquor: కదిరిలో కర్ణాటక మద్యం కలకలం… భారీగా పట్టుకున్న పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. 92 కర్ణాటక మద్యం బాక్సులు పట్టుకున్నట్లు మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీలత వెల్లడించారు.

Translate this News:











