DRDO TAPAS unmanned aerial vehicle crashes: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) అభివృద్ధి చేసిన డ్రోన్ కుప్పకూలింది. కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇది మానవరహిత వైమానిక వాహనం (UAV). హిరియూర్ తాలూకాలోని వడ్డికెరె గ్రామం వెలుపల పంట పొలాల్లో డ్రోన్ క్రాష్ అయ్యింది. డ్రోన్‌పై TAPAS-07A-14 అని నంబర్ రాసి ఉంది. ఘటన జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడవంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్డీవో అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫీల్డ్‌లో చెల్లాచెదురుగా డ్రోన్ పరికరాలు పడి ఉన్నాయి. UAV పూర్తిగా ధ్వంసమైంది.
పూర్తిగా చదవండి..పంట పొలాల్లో DRDO డ్రోన్.. పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ ప్రజలు! వీడియో
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనం (UAV) కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని వడ్డికెరె పంట పొలాల్లో కూలిపోయింది. ఈ ఘటనలో UAV పూర్తిగా ధ్వంసమైంది. డ్రోన్‌పై TAPAS-07A-14 అని నంబర్ రాసి ఉంది.

Translate this News:











