సీఎం కేసీఆర్కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయాలేదన్న కేసీఆర్.. కాంగ్రెస్ ఏం చేసిందో తెలియదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో పర్యటిస్తున్న కోమటిరెడ్డి అక్కడ బొగ్గు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ స్టడీ టూర్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎంపై ధ్వజమెత్తారు. కేసీఆర్ రాజకీయ ప్రస్తానం మొదలైందే కాంగ్రెస్లో అని ఎంపీ గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడ ఉండేవాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో తెలియదా..?
సీఎం కేసీఆర్పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.

Translate this News:











