Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. 2024 అమెరికన్ ఎన్నికల్లో పాల్గొనాలని అనుకుంటున్న అతనికి న్యూయార్క్ కోర్టు (New York Court) ఝలక్ ఇచ్చింది.
ట్రంప్, అతని కుమారులు ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని తేల్చి చెప్పింది న్యూయార్క్ నాయస్థానం. ట్రంప్ తమ కంపెనీ ఆస్తులను ఎక్కువగా చూపిస్తూ పలు ఒప్పందాలు చేసుకోవడమే కాక అక్రమంగా అప్పులు కూడా తీసుకున్నారని న్యూయార్క్ జడ్జి ఆర్ధర్ ఎంగ్రోన్ (Judge Arthur Engoron) స్పష్టం చేశారు. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్నారు.
Donald Trump: అవును అతను మోసం చేశాడు…తేల్చిచెప్పిన న్యూయార్క్ జడ్జ్
ట్రంప్ మోసగాడే అంటున్నారు న్యూయార్క్ జడ్జి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుమారులు పదేళ్ళపాటూ తప్పుడు ఆర్ధిక నివేదికలను సమర్పించారని న్యూయార్క్ జడ్జి స్పష్టం చేశారు.

Translate this News:











