తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని.. కానీ పదేళ్లయినా కేసీఆర్ (CM KCR) హామీలను అమలు చేయలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) ధ్వజమెత్తారు. ఈ రోజు తాండూరులో నిర్వహించిన పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. కానీ, పదేళ్లయినా కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని ఆరోపించారు. కర్ణాటకలో తాము 5 గ్యారంటీలను అమలు చేశామన్నారు. గృహజ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. ప్రతీ మహిళకు నెలకు రూ. 2000 అందిస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా?
DK Shiva Kumar: కర్ణాటకకు రండి చూపిస్తాం.. కేసీఆర్, కేటీఆర్ కు డీకే శివకుమార్ సవాల్
కర్ణాటకలో తామ ఎన్నికల హామీల అమలును చూడడానికి కేసీఆర్, కేటీఆర్ రావాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శివకుమార్ సవాల్ విసిరారు. సమయం చెబితే వారిని స్పెషల్ బస్సులో తమ రాష్ట్రానికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం రానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Translate this News:











