బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో టికెట్ రాని నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ నుంచి టికెట్ ఆశించి నిరాశకు గురైన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సంచలన కామెంట్స్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని గులాబీ బాస్‌పై ఆమె ఫైర్ అయ్యారు. తాను గెలిచాక మంత్రి పదవి అడుగుతాననే సీఎం కేసీఆర్ ఈ సారి తనకు టికెట్ ఇవ్వలేదని తెలిపారు. ఇక ఖానాపూర్ అభ్యర్థిగా ఫైనల్ చేసిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని ఆమె మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం ఆమె తరపున పీఏ దరఖాస్తు చేశారు.
పూర్తిగా చదవండి..భవిష్యత్ కార్యాచరణపై బీఆర్ఎస్ అసంతృప్తి నేతల మంతనాలు
బీఆర్ఎస్ టికెట్లు రాని అభ్యర్థులు బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఆమెతో పాటు వేముల వీరేశం, రాథోడ్ బాపూరావు, మరికొంత మంది నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

Translate this News:














