జనగామ టికెట్ మళ్లీ ఆయనకే వస్తుందా.. ఇటీవల సొంత పార్టీపై ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడెందుకు మాట మార్చారు. తనకు సీటు ఖాయమైందని ఎమ్మెల్యే ధీమాగా వున్నారా.. తన భూమిని ఎమ్మెల్యే కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఆ ఎమ్మెల్యే తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతోనే ఉన్నారా..? తాను సీఎం పిలిస్తేనే కాంగ్రెస్ నుంచి వచ్చానన్నా ఆయన.. తన క్యాడర్ మొత్తం కాంగ్రెసే అని గతంలో చెప్పిన ఎమ్మెల్యేకు అధిష్టానం టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుందా.? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు.. ఏంటా నమ్మకం.
పూర్తిగా చదవండి..MLA ticket: ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కినట్లేనా..
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా అధికార పార్టీకి అనుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం గమనిస్తుందన్న ఆయన.. పార్టీలో పంచాయతీ పెట్టేవారికి మంత్రి కేటీఆర్ బుద్దిచెప్పారన్నారు. జనగామా నుంచి మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని ఆయన స్పష్టం చేశారు.

Translate this News:











