Diabetic Can Eat Banana: ప్రస్తుత కాలంలో మధుమేహ(Diabetic) బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, ఒకసారి మధుమేహం బారిన పడిన వారు.. తాము తినే ఆహారం (Food)పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అరటి పండును తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అరటి పండులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. కానీ అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. డయాబెటిక్ రోగులు సాధారణంగా అరటిపండ్లను పూర్తిగా నివారించాలని సలహా ఇస్తారు ఆరోగ్య నిపుణులు. కానీ, ఇది సరికాదని మరికొందరు చెబుతారు. అరటిపండులో ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు తినడం వల్ల ఎలాంటి హాని ఉండదంటున్నారు. ఒక వైద్య పరిశోధన ప్రకారం, అరటిపండును మధుమేహం చికిత్సకు సాంప్రదాయ ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, అరటి కాండం, పువ్వులు మధుమేహం విషయంలో కూడా కొంత వరకు మేలు చేస్తాయి.
పూర్తిగా చదవండి..Diabetic Diet: మధుమేహ బాధితులు అరటిపండు తినొచ్చా? ప్రయోజనాలు, అప్రయోజనాలు మీకోసం..
ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే, ఒకసారి మధుమేహం బారిన పడిన వారు.. తాము తినే ఆహారం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అరటి పండును తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

Translate this News:











