Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ(Telangana) ఎన్నికల నేపథ్యంలో నేతల కప్పదాట్లు పెరిగిపోయాయి. ఆశించిన సీట్లు రాక కొందరు.. అనుచరులుగా మరికొందరు పార్టీలు మారుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్, బీజేపీల్లోకి.. కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ లోకి ఇలా కప్పదాట్లు ఊపందుకున్నాయి. తాజాగా దేవరకొండలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రధాన అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. గుత్తా ప్రధాన అనుచరులుగా పేరొందిన దేవరకొండ ప్రాంతానికి చెందిన నేతలందరూ హస్తం తీర్థం పుచ్చుకున్నారు. దేవరకొండలో బాలు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నాయకులు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సిరందాస్ కృష్ణయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మమ్మ కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్, దేవరకొండ టికెట్ ఆశించిన వడ్త్యా దేవేందర్ నాయక్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: దేవరకొండలో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి గుత్తా అనుచరులు..
నల్లగొండ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. తాజాగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరులు దేవరకొండ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, ఎంపీపీ జాన్ యాదవ్, సిరందాస్ కృష్ణయ్య, లక్ష్మమ్మ, కృష్ణయ్య, వడ్త్యా దేవేందర్ నాయక్ సహా పలువురు కాంగ్రెస్‌లో చేరారు.

Translate this News:











