ఈ మధ్య కాలంలో డెంగీ(Dengue) బారిన పడే వారి సంఖ్య పెరిగిపోయింది. సామాన్యులు, సెలబ్రెటీలు..ఇలా ప్రతి ఒక్కరిని డెంగీ దోమ కుడుతుంది. ఎందుకంటే డెంగీ దోమలకు ఎలాంటి భేద భావాలూ ఉండవు. డెంగీ సోకిందంటే ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. ఇది మన బాడీని చాలీ వీక్ చేసేస్తుంది.డెంగీ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా సోకిన ఆడ ఈడెస్ దోమలు, ముఖ్యంగా ఈడిస్ ఈజిప్టి కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాలలో ముఖ్యమైన ప్రజారోగ్య సమస్య.
పూర్తిగా చదవండి..Dengue: ఇలా చేస్తే దెబ్బకు డెంగీ పరార్.. ఈ చిట్కాలతో దోమలకు దబిడి దిబిడే..!
డెంగీ బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే అసలు ఈ వ్యాధి తెచ్చుకోకుండా ఉండడం ముఖ్యం. కొన్ని చిట్కాలు పాటిస్తే డెంగీ సోకకుండా ఉండవచ్చు. మీ ఇంటికి దోమలు రాకుండా కిటికీలు, తలుపులకు తెరలు ఉండేలా చూసుకోండి. దోమల వృద్ధి ప్రదేశాలను నిర్మూలించండి. బెడ్ నెట్స్ ఉపయోగించండి.

Translate this News:











