రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును హోంమంత్రి అమిత్షా ప్రవేశపెట్టారు. అటు బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి ప్రారంభించారు. ఇప్పటికే లోక్సభలో పాస్ అయిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా పాస్ అయితే ఆ తర్వాత ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. ఇక 237మంది ఎంపీలున్న రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 119 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీఏ(NDA)కి 131మంది ఎంపీల బలముండగా.. విపక్ష కూటమి INDIAకి 99మంది ఎంపీల సపోర్ట్ ఉంది. బీజేడీ, వైసీపీ, టీడీపీ ఎన్డీఏకే మద్దతిస్తోంది. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి సపోర్ట్ ఇస్తుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. INDIA కూటమికి బీఆర్ఎస్ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తుండడంతో బిల్లుకు వ్యతిరేకంగా పడే ఓట్లు సంఖ్య 108కు చేరే అవకాశాలున్నాయి. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది.
పూర్తిగా చదవండి..ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఉత్కంఠ.. రాజ్యసభలో కొనసాగుతోన్న చర్చ
ఇప్పటికే లోక్సభలో పాసైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును రాజ్యసభలోనూ పాస్ చేసుకునేందుకు ఎన్డీఏ సిద్ధమైంది.ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును హోం మంత్రి అమిత్షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు పాస్ అయితే ఢిల్లీలోని అధికారులపై పెత్తనం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. అధికారుల నియామకాలు, బదిలీల అంశం కేంద్రం నియంత్రణలోకి వెళ్తుంది.

Translate this News:











