Stay Safe During an Earthquake: ఢిల్లీ-ఎన్సీఆర్(Delhi NCR), ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపాని(Earth quake)కి మూలం నేపాల్(Nepal)లో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. నేపాల్‌లో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ కార్యాలయ భవనాల నుంచి బయటకు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్‌మీడియాలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలువురు నెటిజన్లు దాదాపు 10 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని పోస్ట్ చేశారు. ఇక భూకంపం వచ్చిన సమయంలో ఏం చేయాలి..? ఏం చేయాకూడదు అన్నదానిపై కచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ఎక్కడో ఢిల్లీలో వచ్చిందిలే అనుకుంటే సరిపోదు. మన దగ్గర కూడా ఎప్పుడో అప్పుడు రావచ్చు. అందుకే ఈ టిప్స్ తెలుసుకోవాలి.
పూర్తిగా చదవండి..Earthquake: భూకంప సమయంలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఢిల్లీతో పాటు ఉత్తరభారత్దేశంలో భూకంపం రావడం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. చాలా మంది ఇళ్లు, ఆఫీస్‌లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చినప్పుడు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. మీ మొబైల్ ఫోన్‌ను అనవసరంగా ఉపయోగించవద్దు, కిటికీల దగ్గర ఉండొద్దు, దెబ్బతిన్న భవనంలోకి తిరిగి ప్రవేశించవద్దు, అగ్గిపెట్టెలు లేదా లైటర్లను ఉపయోగించవద్దు లాంటి టిప్స్‌ని పాటించాలి.

Translate this News:











