Mukesh Ambani receives death threat: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani)కి మరోసారి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ ఈ-మెయిల్ వచ్చింది. 20 కోట్లు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి బ్లాక్మెయిల్ చేశాడు. అంబానీకి ఇలా బెదిరింపులు రావడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు వచ్చాయి. దీంతో అంబానీకి సెక్యూరిటీ పెంచారు పోలీసులు. అక్టోబర్ 27(నిన్న)న షాదాబ్ ఖాన్ అనే పేరుతో ఈ-మెయిల్ వచ్చింది. ఈ విషయాన్నిముఖేశ్ అంబానీ భద్రతా సిబ్బంది పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తిపై ఐపీసీ 387, 506(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీ అడ్రెస్ ట్రాక్ చేసే పనిలో ఉన్నారు.
పూర్తిగా చదవండి..Mukesh Ambani: ముఖేశ్ అంబానీకి ప్రాణహాని? రూ.20కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులు!
రూ.20 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అంబానీకి సెక్యూరిటీ మరింత టైట్ చేశారు పోలీసులు. గతంలోనూ అంబానీకి పలుమార్లు బెదిరింపు లేఖలు వచ్చాయి. అంబానీ నివాసం యాంటిలియాకు సమీపంలోని ఓ కారులో పేలుడు పదార్థాలు దొరకడం అప్పట్లో సంచలనం రేపింది.

Translate this News:












