ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్య (Ponnala Laxmaiah) లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని వీడడం సంచలనంగా మారింది. అయితే.. కాసేపట్లో పొన్నాల నివాసానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లనున్నట్లు సమాచారం. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీలోకి (BRS party) ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు జనగాం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మయ్యను జనగాం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీకి దించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కుదరని పక్షంలో ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Big Breaking: కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా.. ఆ పార్టీలో చేరే ఛాన్స్?
Telangana Politics: ఆ ఇద్దరు బీఆర్ఎస్ లీడర్ల సైలెంట్ ఆపరేషన్.. పొన్నాల రాజీనామా వెనుక ఏం జరిగిందో తెలుసా?
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే.. పొన్నాలను గులాబీ గూటికి చేర్చడంలో బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్, కేశవరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

Translate this News:











