MLA Danam Nagender – BRS Will Score Hat Trick: తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కేసీఆర్ (KCR) వరుసగా మూడో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆయన జోస్యం చెప్పారు. ఖైరతాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, అతి తక్కువ కాలంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దిందన్నారు. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న విదేశీ సంస్థలు దేశ వ్యాప్తంగా అనేక నగరాలు ఉన్నా.. సంస్థలను హైదరాబాద్‌లోనే స్థాపిస్తున్నారన్నారు.
పూర్తిగా చదవండి..MLA Danam Nagender: బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుంది: దానం ధీమా
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని ఖైరాతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అందుకు కారణమన్నారు. కేసీఆర్ మరోసారి సీఎం అవ్వడం ఖాయమన్నారు.

Translate this News:











