Madurai Train Fire : తమిళనాడులోని మధురైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మదురై స్టేషన్లో ఆగి ఉన్న రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. వార్తా సంస్థ PTI ప్రకారం, లక్నో నుండి రామేశ్వరం వెళ్తున్న రైలు ప్యాసింజర్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించారని.. 20 మంది గాయపడ్డారని దక్షిణ రైల్వే వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Madurai Train Fire : రైలులో పేలిన సిలిండర్లు..పెరుగుతున్న మృతుల సంఖ్య..!!
తమిళనాడులోని మధురైలో విషాదం నెలకొంది. మధురై రైల్వే స్టేషన్లో పునలూర్-మధురై ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైలులో ప్రయాణికులు అక్రమంగా తీసుకెళ్తున్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు పది మంది మరణించారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు 20మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Translate this News:











