CWC Meeting: తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ మొదలైంది. రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా నగరానికి తరలివస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర అగ్రనేతలు మరికాసేపట్లో భాగ్యనగరానికి చేరుకోనున్నారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటున్న నేతలకు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలుకుతున్నారు టీపీసీసీ కార్యకర్తలు. కాంగ్రెస్ అగ్రనేతల రాకతో పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులతోపాటు సీఐఎస్ఎఫ్ జవాన్లు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నేతలు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..CWC Meeting: హైదరాబాద్‌లో CWC సందడి.. టీకాంగ్రెస్‌లో జోష్
తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ మొదలైంది. రెండు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా నగరానికి తరలివస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర అగ్రనేతలు మరికాసేపట్లో భాగ్యనగరానికి చేరుకోనున్నారు.

Translate this News:











