Supreme Court: గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలి అబార్షన్ కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది . భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు, సమాజానికి ఆనందాన్ని కలిగిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు, అది ఆమె మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది.
పూర్తిగా చదవండి..Supreme Court : అత్యాచార బాధితురాలి అబార్షన్‌కు అనుమతిస్తూ సుప్రీకోర్టు కీలక నిర్ణయం..!!
అత్యాచార బాధితురాలి అబార్షన్ కు అనుమతిస్తూ సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థలో గర్భం దాల్చడం దంపతులకు ఆనందం ఇస్తుందని సుప్రీం తెలిపింది. కానీ ఒక స్త్రీ తన ఇష్టానికి విరుద్ధంగా గర్భవతి అయినప్పుడు..అది ఆమె మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. గుజరాత్‌కు చెందిన అత్యాచార బాధితురాలికి అబార్షన్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 19న, ఈ అంశంపై విచారణ సందర్భంగా, గుజరాత్ హైకోర్టు వైఖరిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మెడికల్ బోర్డు నుండి తాజా నివేదికను కోరింది.

Translate this News:











