CPI Narayana: ప్రధాని మోదీ, సీఎం జగన్ అంటేనే ప్రజలకు తీవ్ర అసహ్యమేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని(BJP), ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YSRCP)ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు నారాయణ(CPI Narayana). ఏపీలో సీపీఐ చేపట్టిన బస్సు యాత్ర తిరుపతికి చేరుకుంది. ఈ సందర్భంగా నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర ప్రముఖలతో పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల నుంచి కమ్యూనిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన నారాయణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన కామెంట్స్ చేశారు. వైసీపీ పాలనలో వేంకటేశ్వర స్వామిని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. టిటిడిలో సారాయి అమ్మే వాళ్ళను సభ్యులుగా నియమించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల నడక దారిలో వెళ్లే భక్తులకు కర్రలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు నారాయణ.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: మోదీ, జగన్ అంటే అసహ్యమేస్తోంది.. సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్..
ప్రధాని మోదీ, సీఎం జగన్ అంటేనే ప్రజలకు తీవ్ర అసహ్యమేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీని, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు నారాయణ.

Translate this News:











