Countries that pay highest starting salary for high school teachers: ఇవాళే(సెప్టెంబర్ 5) టీచర్స్ డే. కేవలం స్కూల్స్, కాలేజీల్లోనే కాదు.. నిజజీవితంలోనూ మనకు గురువులుంటారు. అలాంటివారిందరికి విషెస్ చెప్పండి. అటు స్కూల్స్‌లో ఎలాగో ఇవాళ పిల్లలు టీచర్లలా మారిపోతారు. వారిని అనుకరిస్తూ టీచర్లను ఖుషీ చేస్తారు. టీచర్లు కూడా ఇవాళ సీరియస్‌గా ఉండరు.. పిల్లలతో ఎంతో సరదగా గడుపుతారు. ఇలా ఎప్పుడు ఎలా ఉండాలో తెలిసిన మన భారతీయ టీచర్లకు జీతాలు మిగిలిన దేశాలతో పోల్చితే అంతంతమాత్రమే. కేవలం మన దగ్గరే కాదు.. అగ్రరాజ్యం అమెరికాలోనూ టీచర్లకు వేతనాలు తక్కువేనట. అందుకే వేరే దేశాల నుంచి అమెరికాలోని విద్యాసంస్థలు టీచర్లను రిక్రూట్చేసుకుంటున్నాయి. మరి ఏ దేశంలో టీచర్లకు శాలరీలు ఎక్కువ..?
ప్రపంచ బ్యాంక్ డేటా, లెర్నింగ్ పోలీస్ ఇన్స్టట్యూట్ ప్రకారం.. ఉపాధ్యాయులకు తక్కువ వేతనం లభిస్తుంది.. ఇది చాలా దేశాలు విద్యావేత్తల కొరతను ఎదుర్కోవటానికి ఒక కారణం కావచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ నుంచి సేకరించిన డేటా ప్రకారం అమెరికాలో అనేక రాష్ట్రాలు టీచర్లకు వేతనాలు తక్కువ ఇస్తున్నాయి. దీంతో అమెరికాలోకి ఇతర దేశాల నుంచి ఔట్ సోర్సింగ్ టీచర్లు వస్తున్నారు.
Teachers day 2023: అక్కడ టీచర్లకు నెలకు 5 లక్షల జీతం.. విద్యావ్యవస్థ కూడా అదుర్స్!
టీచర్స్ డే(సెప్టెంబర్ 5) సందర్భంగా ప్రతిఒక్కరూ తమ గురువులను గుర్తు తెచ్చుకుంటున్నారు. స్కూల్, కాలేజీల్లో విద్యార్థులు నేరుగా విషెస్ చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచంలో ఏ దేశంలో టీచర్లకు అత్యధిక జీతాలు ఇస్తారోనని ఆసక్తి చూపిస్తున్నారు. లక్సెంబర్గ్‌లో సగటున నెలకు రూ.5లక్షల జీతాన్ని పొందుతున్నారు టీచర్లు.

Translate this News:











