కార్పొరేట్ ఉద్యోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయడం.. నిబంధనలు పాటించకుండానే గంటలకొద్ది పని చేయాల్సి ఉంటుంది. అలాగే మనవల్ల ఏదైన చిన్న పొరపాటు జరిగినా కూడా పైస్థాయి అధికారులు తిడితే పడాల్సి ఉంటుంది. అందుకే చాలామంది కార్పొరెట్ లేదా టెకీ ఉద్యోంగలో పనిచేసేవారు పని ఒత్తిడని ఎదుర్కొంటారు. ఇలాంటి సవాళ్లతో కూడుకున్న ఉద్యోగం చేయడం కత్తి మీద సాము లాంటిందే. అయితే జీవితం గడవాలి.. సంపాదన కావాలనే ఆలోచనతో వాటిని తట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవిషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో లేఆఫ్స్ కూడా పెరిగిపోవడం ఉద్యోగులను మరింతగా వేధింపులకు గురిచేస్తోంది. ఆర్థికమాంద్యం రావడంతో ఖర్చులు తగ్గించుకునేందుకు చాలా కార్పొరేట్ కంపెనీలు, ఐటీ దిగ్గజాలు వేలాది ఉద్యోగాలు తీసేశాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. దీన్ని యూట్యూబ్‌లో పోస్టు చేసిన మూడు రోజుల్లోనే 20.3 లక్షలకు పైగా వ్యూస్ రావడం మరో విశేషం. ప్రముఖ పారిశ్రమికవేత్త అయిన హర్షగెయెంకాను కూడా ఈ వీడియో ఆకర్షించింది. అంతేకాదు ఆయన కూడా ఈ వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
పూర్తిగా చదవండి..Watch Video: కార్పొరేట్ ఉద్యోగమా లేక పానీ పూరి అమ్ముకోవడమా.. వైరలవుతున్న వీడియో
కార్పొరేట్ ఉద్యోగం అంటే సవాళ్లతో కూడుకున్న పని. రాత్రి పగలు తేడా లేకుండా పని చేయాల్సి ఉంటుంది. ఇందులో పనిచేసే చాలామంది ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. కార్పొరేట్ ఉద్యోగం కన్నా.. పానీపూరి అమ్ముకునే వ్యక్తి జీవితం మేలు అన్నట్లుగా ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నరీతిలో స్పందిస్తున్నారు. మరికొందకు ఇది ఒక విషాదకర పరిస్థితి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Translate this News:











