తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో బాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాతో పార్టీలో అసమ్మతి గళాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. టికెట్ ఆశించి భంగ పడ్డ నేతలంతా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, నిరసనలతో పోరుబాట పడుతున్నారు. పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ పలు ఆరోపణలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Congress: ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ షాక్.. పార్టీ నుంచి సస్పెండ్.. ఎందుకంటే?
కాంగ్రెస్ లో అసమ్మతి గళాలు షురూ అయ్యాయి. టికెట్ రాని నేతలంతా ఒక్కొక్కరుగా తమ అసమ్మతిని వినిపిస్తున్నారు. తాజాగా గాంధీభవన్ లో మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. మేడ్చల్ టికెట్ హర్షవర్దన్ రెడ్డికే కేటాయించాలంటూ వారు డిమాండ్ చేశారు. అటు మరో నేత టీపీసీసీ కార్యదర్శి కురువ విజయ్ కుమార్ కూడా ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి రూ. 600కోట్లకు 65 సీట్లను అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Translate this News:











