Rahul Gandhi in Telangana: తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రచారం జోరుగా సాగుతోంది. మంథనిలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. ‘2004 లో తెలంగాణ(Telangana) ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది’ అని గుర్తు చేశారు. అయితే, ఏ ఆకాంక్షలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. దీనికి కారణం తెలంగాణ దొరల పాలనలోకి వెళ్లడమేనని వ్యాఖ్యానించారు. ఇది దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు రాహుల్. కేసీఆర్ తనను తాను ఒక రాజుగా భావిస్తున్నారని, ఎన్నికల్లో ఓడిస్తే ఆ భావం నుంచి బయటకొస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఫలాలు ఒకే కుటుంబానికి దక్కుతున్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని సంచలన ఆరోపణుల చేశారు. ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజలకు మాత్రం నీళ్లు అందడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైనా లబ్ధి పొందారంటే.. అది కేవలం కేసీఆర్ కుటుంబమేనని అన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణతో మాకున్నది ప్రేమానురాగాల బంధం.. రాహుల్ ఆసక్తికర కామెంట్స్..
తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం జోరుగా సాగుతోంది. మంథనిలో రోడ్ షో నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. '2004 లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది.. రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంది' అని గుర్తు చేశారు. అయితే, ఏ ఆకాంక్షలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు.

Translate this News:











