Telangana Elections: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెడుతోందని, పెద్దు ఎత్తున డబ్బుల పంపిణీ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). ఈమేరకు ఎన్నికల సంఘానికి ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు పంపిణీ చేపడుతున్న బీఆర్ఎస్ను తక్షణమే అడ్డుకోవాలని, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉత్తమ్. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్. ఎన్నికల వేళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2018లోనూ ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తూ పంపిణీ చేస్తోందని ఆరోపించారు ఉత్తమ్. ఇలా అనేక ఎన్నికల సందర్భాల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ.
పూర్తిగా చదవండి..Telangana Elections: డబ్బుల పంపిణీని కట్టడి చేయండి.. ఈసీకి ఎంపీ ఉత్తమ్ ఫిర్యాదు
తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పార్టీ అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు ఎంపీ ఉత్తమ్. ఎన్నికల వేళ అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 2018లోనూ ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో డబ్బులను నేరుగా ప్రజల ఖాతాల్లోనే జమ చేస్తోందని, ఈ పంపిణీని అడ్డుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఎంపీ ఉత్తమ్.

Translate this News:











