Rahul Gandhi Delhi House: లోకసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తిరిగి లోకసభలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నివాసంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజాగా రాహుల్ గాంధీకి…ఢిల్లీ తుగ్లక్ లేన్లో ఉన్న 12వ నెంబర్ బంగ్లాను తిరిగి కేటాయించారు. సభ్యత్వం కోల్పోయిన తర్వాత లోకసభ సెక్రెటేరియల్ ఆదేశాలతో ఈ ఇంటిని రాహుల్ గాంధీ ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. మోడీ ఇంటిపేరు కేసులో 2 సంవత్సరాల శిక్ష పడిన తర్వాత అతను తన నివాసాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. తాజా ఉత్తర్వుల తర్వాత లోక్సభ హౌసింగ్ కమిటీ ఆయనకు బంగ్లాను కేటాయించింది. ఇప్పుడు మళ్లీ తన పాత బంగ్లాలోకి వెళ్లనున్నారు. అయితే ఈ సందర్భంలో రాహుల్ గాంధీ భారతదేశం మొత్తం నా ఇల్లే అంటూ వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..రాహుల్ గాంధీకి మళ్లీ అదే బంగ్లా కేటాయింపు ..!!
కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ప్రభుత్వ నివాసాన్ని తిరిగి పొందారు. లోకసభ సభ్యత్వం కోల్పోయిన అనంతరం ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను విడిచిపెట్టాల్సి వచ్చింది.

Translate this News:











