MLC Jeevan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(MLC Jeevan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్(CM KCR) పాలనంతా అవినీతిమయం అని ఆరోపించారు. అంతేకాదు.. కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్టు స్పాట్‌గా మారుతుందని గతంలోనే చెప్పానని అన్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే తాను అన్న మాట నిజమైందన్నారు. కుంగిపోతున్న ప్రాజెక్టును చూసేందుకు అందరూ వస్తున్నారని అన్నారు. గోదావరి వదర ప్రవాహం వస్తే ఇసుక తరలి పోతుందనే కనీస పరిజ్ఞానం కేసీఆర్‌కు లేదని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Telangana: కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సాధించే తొలి విజయం కామారెడ్డే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామన్నారు జీవన్ రెడ్డి. ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు అవగాహన లేకపోతే.. ఇంజనీర్లకు లేదా? అని ప్రశ్నించారు. ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో వేయాలని డిమాండ్ చేశారు.

Translate this News:











