సోషల్‌మీడియా వాడడంలో టీడీపీ దిట్ట అని చంద్రబాబు పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీడీపీ కల్చర్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తుందన్నారు. తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సభలు సక్సెస్ చేసినా నేను పార్టీ మారుతారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని ఫైర్ అయ్యారు. పార్టీ అన్ని కార్యక్రమాలకు తమకు సమాచారం వస్తుందన్నారు.
జగ్గారెడ్డి ఏం అన్నారంటే?
టీడీపీ భ్రష్టు పట్టించింది..ఇదేం శాడిజం అంటూ జగ్గారెడ్డి ఫైర్!
తన రాజకీయ ప్రయాణం రాహుల్‌గాంధీతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోషల్‌మీడియా వాడడంలో టీడీపీ దిట్ట అని.. ఆ కల్చర్ కాంగ్రెస్‌ని భ్రష్టు పట్టించిందన్నారు. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా మంత్రులను, సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు జగ్గారెడ్డి.

Translate this News:











