Hyderabad CWC Meeting: రాజ్యాంగాన్ని దెబ్బతీస్తూ.. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని ఎన్డీయే(NDA Govt) ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత పి. చిదంబరం. ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగానికి, సమాఖ్య వ్యవస్థకు సవాల్‌గా మారాయన్నారు. ఫెడరలిజం క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారాయన. శనివారం హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం తొలిరోజు జరిగిన చర్చల వివరాలను పి. చిదంబరం మీడియాకు వెల్లడించారు. జాతి కలహాలకు వేదికగా మారిన మణిపూర్‌లో పర్యటించడానికి ప్రధాని నరేంద్ర మోదీకి కనీసం రెండు గంటల సమయం కూడా దొరక్కపోవడం నిజంగా ఆశ్చర్యమేసిందని విమర్శలు గుప్పించారు చిదంబరం.
పూర్తిగా చదవండి..Hyderabad CWC Meeting: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న మోదీ ప్రభుత్వం.. కేంద్రంపై చిదంబరం ఫైర్..
సనాతన ధర్మం అంశంపై సిడబ్ల్యూసి మీటింగ్‌లో ఎలాంటి చర్చ జరుగలేదని పి. చిదంబరం తెలిపారు. సనాతన ధర్మం అంశాన్ని వివాదాల్లోకి లాగడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. తాము 'సర్వ ధర్మ సమా భవ' కు కట్టుబడి ఉంటామని, దానినే తాము విశ్వసిస్తామని అన్నారు చిదంబరం.

Translate this News:











