ఇటీవల తమ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హన్మంతరావును (Mynampalli Hanmanthrao) ఓడించడమే లక్ష్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) వ్యూహాలు రచిస్తోంది. మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమ వైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన నందింకటి శ్రీధర్ తో (Nandikati Sreedhar) మంత్రి కేటీఆర్ స్వయంగా మాట్లాడారు. మంచి పదవి ఇస్తామని కేసీఆర్ (CM KCR) నుంచి కూడా నందికంటికి హామీ లభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు నందికంటి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ సమక్షంలో శ్రీధర్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు ఆయన తన అనుచరులతో బీఆర్ఎస్ భవన్ కు వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Politics: ఆ ముగ్గురు మళ్లీ మిస్.. కాంగ్రెస్లోకి జంపేనా?
Telangana Politics: టార్గెట్ మైనంపల్లి.. బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ కీలక నేత
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నందికంటి శ్రీధర్ ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్ లో చేరనున్నారు. కేటీఆర్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

Translate this News:











