తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను తయారు చేయడంలో హైకమాండ్ బిజీగా మారింది. అయితే.. ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం ఉండడంతో ఇంకా ఫైనల్ లిస్ట్ ను (Telangana Congress MLA Candidates Final List) తయారు చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ రోజు లేదా రేపు వేముల వీరేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి కూడా చేరుకున్నారు. ఇంకా బీజేపీ నుంచి సైతం కాంగ్రెస్లోకి భారీ చేరికలు ఉండే అవకాశం ఉంది. బీజేపీకి (Telangana BJP) చెందిన దాదాపు పది మంది ముఖ్యనేతలు ఒకేసారి హస్తం గూటికి చేరుతున్నారన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ అప్పుడే.. ఆశావహులకు హైకమాండ్ కీలక ఆదేశాలు!
తెలంగాణ కాంగ్రెస్ టికెట్ల ప్రకటన మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. చేరికలు పూర్తి అయిన తర్వాత అక్టోబర్ మొదటి వారంలో ఒకే సారి 119 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

Translate this News:











