Telangana Elections: తెలంగాణలో ఓవైపు ఎన్నికలు సమీపిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్(Congress) పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపిక వద్దే ఉండిపోయింది. ఎలాగోలా మొదటి విడత అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. రెండవ విడత అభ్యర్థుల ఖరారు విషయంలోనే తర్జన భర్జన పడుతోంది. అయితే, సెకండ్ లిస్ట్ ఆలస్యానికి ఖమ్మం జిల్లాలో సీట్ల కేటాయింపేనని తెలుస్తోంది. ఇక్కడ ప్రధాన నేతలంతా తమ తమ అనుచరులకే టికెట్లు కేటాయించాలని పట్టుబట్టడం.. అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.
పూర్తిగా చదవండి..Telangana Congress: పొంగులేటికి కాంగ్రెస్ బిగ్ షాక్! ఆస్థానంలో పోటీకి ఊహించని నేత..!
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ రెండో విడత జాబితాలో ఊహించని మార్పులు, చేర్పులు చేశారని సమాచారం. ఈ లిస్ట్‌లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు జెడ్పీచైర్మన్ కోరం కనకయ్య పేరు రావడం కష్టంగానే కనిపిస్తోందంటున్నారు పార్టీ శ్రేణులు. కాగా, కోరం కనకయ్య ఇల్లందు కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Translate this News:











