Telangana: తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డి దొరల రాజ్యం నడుస్తోందని.. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఉద్యమకారుడు, నల్లగొండకు చెందిన సీనియర్ నాయకుడు చెరుకు సుధాకర్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. గెలుపు గుర్రాలు అనే ఒక అమానవీయమైన మాట చెప్పి బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తోందని, బీసీల కోసం ఉదయ్‌పూర్ డిక్లరేషన్ చేసిందని, అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని నిర్ణయించిందని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నాయకులు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కారని మండిపడ్డారు. టీ కాంగ్రెస్ అగ్రనేతలు భూస్వామ్యవాదంతో ముందుకు వెళుతున్నారని, కొందరు వాళ్ల కుటుంబాలు, కులాల కోసమే పనిచేస్తున్నారన్నారు. బీసీ నేతలు తెలంగాణ కోసం ఎంతో కొట్లాడారని.. కానీ ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్‌తో బీసీలకు ఒరిగేదేం లేదు.. అక్కడంతా రెడ్డి దొరల రాజ్యమే..
తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డి దొరల రాజ్యం నడుస్తోంది. బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అన్ని వర్గాలుంటేనే కాంగ్రెస్ జన బలగం.. కాకుంటే అది జలగల బలగమే.. కాంగ్రెస్‌కు నష్టం జరగాలని నేను కోరుకోవడం లేదు. బీసీలకు మంచి జరగాలనే వేరే పార్టీలోకి వెళుతున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్..

Translate this News:











