విపక్ష ‘ఇండియా’కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగే విపక్ష కూటమి మూడవ సమావేశంలో కన్వీనర్ గా మల్లిఖార్జున ఖర్గే పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖర్గే అత్యంత సీనియర్ నేత కావడంతో ఆ పదవికి ఆయన పేరును ప్రతిపాదించాలని పలు పార్టీల నేతలు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్…. !
విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.

Translate this News:











