బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మహాత్మగాంధీతో పోలుస్తూ.. వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. అలాంటి వ్యక్తిని మహాత్మగాంధీతో పోల్చడం అవమానించడమేనని ఆర్జేడీ పార్టీ విమర్శలు గుప్పించింది. మరోవైపు ఇది హేయమైన చర్య అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాజధాని అయిన పాట్నాలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను దేశానికి రెండో గాంధీగా అభివర్ణిస్తూ పోస్టర్లు కనిపించాయి. జనతాదళ్ యూనైటెడ్ పార్టీకి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వం కోసం పోరాడారని.. ఆ పోస్టర్లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. అలాగే సామాజికి సంస్కరణలు తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మహాత్మగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారంటూ ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు.
పూర్తిగా చదవండి..CM Nitish Kumar: నితీష్ కుమార్ను రెండో గాంధీగా పోలుస్తూ పోస్టర్లు.. విపక్షాలు ఏమన్నాయంటే..
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మహాత్మగాంధీతో పోలుస్తూ.. వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. అలాంటి వ్యక్తిని మహాత్మగాంధీతో పోల్చడం అవమానించడమేనని ఆర్జేడీ పార్టీ విమర్శలు గుప్పించింది. మరోవైపు ఇది హేయమైన చర్య అంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Translate this News:











