ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకే సారి ప్రకటించి దూకుడు మీద ఉంది అధికార బీఆర్ఎస్ (BRS ). ఆ పార్టీ ఇద్దరు కీలక నేతలు హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) నిత్యం అనేక నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) సైతం ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుస మీటింగ్ లతో ఆయన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. పార్టీ అభ్యర్థులకు ఈనెల 15న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఫామ్ లను అందజేయనున్నారు. అనంతరం వారితో సమావేశమై ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్ధేశం చేస్తారు. అనంతరం పార్టీ మేనిఫెస్టోను సైతం సీఎం విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజు హుస్నాబాద్ సభలో సీఎం పాల్గొంటారు. హుస్నాబాద్ లో తొలి ఎన్నికల మీటింగ్ నిర్వహించడం సీఎం కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తారు. గత ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే కేసీఆర్ ఎన్నికల సమరశంఖం పూరించారు. 15, 16, 17, 18 తేదీల్లో కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారు. నవంబర్ 9న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ వేయనున్నారు కేసీఆర్.
ఇది కూడా చదవండి: Telangana BJP-Amit Shah: రేపు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే!
CM KCR: ఇక రంగంలోకి కేసీఆర్.. సెంటిమెంట్ గా అక్కడ తొలి మీటింగ్!
గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) సైతం ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వరుస మీటింగ్ లతో ఆయన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. పార్టీ అభ్యర్థులకు ఈనెల 15న సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో బీఫామ్ లను అందజేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.

Translate this News:











