BRS Public Meeting in Janagama: సీఎం కేసీఆర్ (CM KCR) సభ కోసం బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సిద్ధిపేట రోడ్డుకు ఉన్న 18.23 ఎకరాల మెడికల్ కాలేజీ స్థలంలో సభను నిర్వహిస్తున్నారు. సభా వేదికతో పాటు ముఖ్యులు కూర్చునేందుకు జర్మన్ టెక్నాలజీతో కూడిన టెంటు వేశారు. దీంతో పాటు ప్రజల కోసం భారీ టెంట్లు వేశారు. సభకు లక్ష మంది వస్తారని బీఆర్ఎస్ (BRS Party) భావిస్తోంది. వారి కోసంమజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా వాహనాలను నిలిపి సభ ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాటు చేశారు. కాగా.. జనగామకు చెందిన వారంతా.. ఒగ్గు కళాకారుల, డప్పు చప్పుళ్లు, కోలాట కళాకారుల విన్యాసాల మధ్య సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: జనగామలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ.. సంచలన ప్రకటన చేస్తారా?
సీఎం కేసీఆర్ సోమవారం జనగామకు వెళ్లనున్నారు. సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జిల్లా కేంద్రంలో జరిగే ప్రజాఆశీర్వాద సభలో పాల్గొంటారు. మ.2 గంటలకు ఆయన జనగామకు చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సీఎం సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో బీఆర్ఎస్ సవాల్‌గా తీసుకుంది.

Translate this News:











