తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ రోజుకో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో పాల్గొన్న ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు. పార్టీ వైఖరి గమనించి ప్రజలు ఓటు వేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కొందరు పదవుల కోసం పార్టీలు మారుతున్నారని విమర్శలు గుప్పించారు. పాలేరును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని… బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే భక్త రామదాసు ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలో ఓడిపోయి ఇంట్లో ఉంటే పిలిచి ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవి ఇచ్చామన్నారు. ఇంత చేస్తే ఖమ్మంలో ఆయన పార్టీకి చేసింది గుండు సున్నా అని ఫైర్ అయ్యారు. పైగా తాను మోసం చేశానని ఆయన ఆరోపించడంపై మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం…పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
కొందరు పదవుల కోసం పార్టీ మారుతారని తుమ్మల నాగేశ్వరరావుపై పంచులు విసిరారు సీఎం కేసీఆర్. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళకు తగిన గుణపాఠం చెబుతారు అంటూ తుమ్మలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు.

Translate this News:











