ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. 2014-18 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలు రిపీట్ అవ్వకుండా ఉండేలా స్కెచ్ సిద్ధం చేశారు. ప్రధానంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నేతలను బీఆర్ఎస్లో చేర్చేలా పథకం రచించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుని క్లీన్ పాలిటిక్స్ కేరాఫ్‌గా మారిన కోనేరు కుటుంబాన్ని బీఆర్ఎస్లో చేరాలని కోరారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. తద్వారా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రతిపక్షాలకు బ్రేక్ వేస్తూనే రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు.
పూర్తిగా చదవండి..Bhadradrikottagudem: సీఎం కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి కోనేరు చిన్ని
నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కోనేరు చిన్ని. 3 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక. భారీ ర్యాలీగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కోనేరు చిన్ని. ముఖ్య అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో కోనేరు చిన్ని చేరనున్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లోకి కోనేరు చిన్ని.

Translate this News:











