తెలంగాణ ఎన్నికల (Telangana Elections 2023) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో సంచలన మేనిఫెస్టోను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల భీమా అందిస్తామన్నారు. ఇంకా ఆసరా పింఛన్లు, రైతు బీమా మొత్తాన్ని పెంచుతామన్నారు. కేవలం రూ.400కే రాయితీపై గ్యాస్ సిలిండర్ ను అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లకార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించారు. ప్రజలకు రూ.5 లక్షల బీమా అందిస్తామని కేసీఆర్ వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. “కేసీఆర్ బీమా-ప్రతీ ఇంటికి ధీమా” పేరుతో ఈ పథకం అందిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: CM KCR: సీఎం కేసీఆర్ భారీ ట్విస్ట్.. వారికి టికెట్ కట్?
BRS Manifesto: అందరికీ రూ.5 లక్షల బీమా.. రూ.400 కే గ్యాస్ సిలిండర్: బీఆర్ఎస్ ఫుల్ మేనిఫెస్టో ఇదే!
తెలంగాణ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ సంచలన మేనిఫెస్టోను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. ఆసరా పింఛన్లను రూ.5 వేలకు, రైతు బంధు సాయాన్ని రూ.16 వేలకు, దివ్యాంగుల పింఛన్ ను రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఇంకా గ్యాస్ సిలిండర్ ను రూ.400కే అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతామన్నారు. రేషన్ కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.

Translate this News:











