CM Jagan tweet on Vijayanagaram train accident: ఏపీ సీఎం జగన్ నేడు విజయనగరం జిల్లా రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. రైళ్లు ఢీకొన్న ఘటన స్థలిని హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు.
పూర్తిగా చదవండి..రైలు ప్రమాదం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది..జగన్ ఆసక్తికర ట్వీట్.!
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనపై జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. గత రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనకు తీవ్రమైన వేదన కలిగించిందని వెల్లడించారు. నడుస్తున్న ఓ రైలు ఆగివున్న మరో రైలును ఢీకొట్టిందని, ఆ రెండు రైళ్లూ ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ భయానక రైలు ప్రమాద ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Translate this News:











