నేడు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఉదయం 10:20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో రుషికొండ వద్ద ఉన్న ఐటీహిల్స్లోని నెంబర్ 3కి వెళ్లనున్నారు. అలాగే అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిల్ నెంబర్ 2 కి చేరుకొని ఇన్ఫోసిస్ నిర్మించిన డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులతో సీఎం జగన్ సమావేశమవుతారు. దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ డెవలప్మెంట్ సెంటర్ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్ హాల్స్, కెఫ్టేరియా, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో దీన్ని రూపొందించారు.
పూర్తిగా చదవండి..CM Jagan: నేడు ఆ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ఈరోజు సీఎ జగన్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. విశాఖలో ఇన్ఫోసిస్ నిర్మించిన డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ ఐటీ ఉద్యోగులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అచ్యుతాపురంలో యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ (ఏపీఐ) ఉత్పత్తులకు సంబంధించి రూ. 421.70 కోట్లతో అక్కడ నిర్మించిన ఈ యూనిట్‌ను ప్రారంభించనున్నారు జగన్.

Translate this News:











