తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. శుక్రవారం (ఆగస్టు 11న) అమలాపురంలో ఏర్పాటయిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని అన్నారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకులు మోసపోయారని , వారు బాకీ పెట్టిన సొమ్మున్నంతటిని మేము తిరిగి చెల్లించామని అన్నారు.
పూర్తిగా చదవండి..చంద్రబాబు అంటే మోసాలు, వెన్నుపోట్లు : సీఎం జగన్!
కోనసీమ జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైఎస్సాఆర్ సున్నా వడ్డీ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న 9.84 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు.

Translate this News:











