చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ (AP Government) మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును (Skill Development Case) సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఉండవల్లి పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ (CBI) దర్యాప్తునకు అభ్యంతరం లేదని చెప్పిన అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి చెప్పిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను పరిశీలిస్తే ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. స్కిల్ డవలప్మెంట్ కేసులో సీబీఐ దర్యాప్తు కోరుతూ నిర్ణయం తీసుకోవాలని న్యాయ స్థానాలను ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Skill Development Scam Case:స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉండవల్లి పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు
Chandrababu Case: చంద్రబాబుకు జగన్ సర్కార్ మరో భారీ షాక్.. స్కిల్ డవలప్మెంట్ కేసు సీబీఐకి?
చంద్రబాబు కేసుల విషయంలో జగన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Translate this News:











